- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాతలకు బుద్ధుండాలి.. పనికి రాని గొట్టంగాళ్లు.. యూట్యూబర్ నా అన్వేషణ సంచలన కామెంట్స్ (వీడియో)
నిర్మాతలు, రివ్యూయర్స్‌కు మధ్య జరుగుతున్న సైలెంట్ వార్ గురించి తెలిసిందే. సినిమా రిలీజ్ అయితే చాలు.. సమీక్షలు ఇచ్చి ఆడియన్స్ థియేటర్స్‌కు రాకుండా చేస్తున్నారు. దీంతో నిర్మాతలు భారీ మొత్తంలో నష్టపోతున్నారు. మంచు విష్ణు తప్ప ఏ నిర్మాత కూడా రివ్యూయర్స్‌ను కట్టడి చేయలేకపోయారు.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్‌లో నిర్మాతలు, రివ్యూయర్స్‌కు మధ్య జరుగుతున్న సైలెంట్ వార్ గురించి తెలిసిందే. సినిమా రిలీజ్ అయితే చాలు.. సమీక్షలు ఇచ్చి ఆడియన్స్ థియేటర్స్‌కు రాకుండా చేస్తున్నారని మొత్తుకుంటున్నారు ప్రొడ్యూసర్స్. దీంతో నిర్మాతలు భారీ మొత్తంలో నష్టపోతున్నారు. మంచు విష్ణు తప్ప ఏ నిర్మాత కూడా రివ్యూయర్స్‌ను కట్టడి చేయలేకపోయారు. ఈ మధ్య వర్జిన్ బాయ్స్ విషయంలో జరిగిన గొడవ కూడా తెలిసిందే. కాగా ఈ సందర్భంగా యూట్యూబర్ నా అన్వేషణ టాలీవుడ్ నిర్మాతలకు సజెషన్ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
‘తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలు ఎవరైతే ఉన్నారో.. మీకు కూడా బుద్ధుండాలి. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పనికిరాని గొట్టంగాళ్లకు సమాధానమిచ్చుకోవడం వేస్ట్ ఆఫ్ టైమ్. వెయ్యి కోట్లు ఖర్చు చేసిన వారు పది వేలు ఇచ్చి బిహార్ బ్యాచ్‌ను దింపండి. సినిమా రిలీజ్ అయ్యే ముందు వస్తారు రివ్యూయర్స్‌ను లేపేస్తరు. ఒక్కడు సచ్చాడంటే మిగతావాళ్లు సెట్ అవుతారు. నా అన్వేషణ మాదిరిగా వాళ్లకేమీ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండదు. వాళ్లను లేపేసిన అడిగే దిక్కు మొక్కు ఉండదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. వీడేంట్రా మరీ ఇంత వాయిలెంట్‌గా ఉన్నాడంటున్నారు జనాలు.






