- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెట్టింగ్ యాప్స్ కేసులో ట్విస్ట్..అలీ ఫ్యామిలీని ఇరికించిన నా అన్వేషణ?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బెట్టింగ్ కేసుల గురించే చర్చ జరుగుతోంది. చిన్నచిన్న యూట్యూబర్ల నుంచి స్టార్ హీరోల వ

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బెట్టింగ్ కేసుల గురించే చర్చ జరుగుతోంది. చిన్నచిన్న యూట్యూబర్ల నుంచి స్టార్ హీరోల వరకు.. అందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో... టాలీవుడ్ కమెడియన్ అలీ ( Comedian Ali) చిక్కులో పడ్డాడు. కమెడియన్ అలీ గురించి సంచలన విషయాలు తాజాగా వెల్లడించారు ప్రపంచ యాత్రికుడు అన్వేషణ ( Prapancha Yatrikudu prapancha yatrikudu naa anveshana). తన యూట్యూబ్ ఛానల్ లో.. ఆలీ బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోట్ చేస్తున్నాడని... ఆయన భార్య కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందంటూ బాంబు పేల్చాడు ప్రపంచ యాత్రికుడు.
అంతేకాదు ఆలీ బాగోతాలు బయటపెడుతూ దాదాపు 11 నిమిషాల వీడియోను కూడా రిలీజ్ చేశాడు. బిర్యానీ ( Biryani ) పేరుతో ఆలీ ఫ్యామిలీ... జనాలను మోసం చేస్తోందని... ఈ వీడియోలో వివరించాడు. రంజాన్ మాసంలో ( Ramzan) ముస్లింలు తప్పు చేయరు... కానీ 1000 కోట్ల ఆస్తి ఉన్న ఆలీ మాత్రం... జనాలతో ఆడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రపంచ యాత్రికుడు. బిర్యానీలు పంచుతూ ఓ వీడియో చేసి... దాన్ని యూట్యూబ్ లో పెడుతున్నారని పేర్కొన్నాడు. ఇక యూట్యూబ్ లో పెట్టిన వీడియోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని... ఫైర్ అయ్యాడు.
ఇకనైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేయండి అంటూ ఆలీని విజ్ఞప్తి చేశాడు. దీంతో ప్రపంచ యాత్రికుడు పెట్టిన వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్... కమెడియన్ ఆలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తున్న ముసుగులో... జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నావా? అంటూ కమెడియన్ ఆలీపై నిప్పులు.. జరుగుతున్నారు. మరి దీనిపై కమెడియన్ ఆలీ ఎలా స్పందిస్తారో చూడాలి. అటు ప్రపంచయాత్రికుడు ఎవరిని టార్గెట్ చేసిన... వాళ్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఆలీ విషయంలో తెలంగాణ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read More..
Preity Zinta: ఐపీఎల్ వేళ చిక్కుల్లో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రితి జింటా.. రాజకీయంగా దుమారం






