శివ జ్యోతి బండారం బయటపెట్టిన ప్రపంచ యాత్రికుడు..5 కోట్లతో!

by velandi.Saikiran |   (  Updated:2025-07-25 06:30:03  IST  )

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ (Betting Apps) గురించి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చిన

శివ జ్యోతి బండారం బయటపెట్టిన  ప్రపంచ యాత్రికుడు..5 కోట్లతో!
X

దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ (Betting Apps) గురించి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చిన్న స్థాయి యూట్యూబర్ నుంచి... స్టార్ హీరో వరకు అందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ కేసుల విషయంలో... తెలంగాణ రాష్ట్ర ( Telangana ) ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే ప్రముఖ ఈ యాంకర్ శివ జ్యోతి పై ( Shiva jyothi ) ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ( naa anveshana) సంచలన ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ చేసి యాంకర్ శివ జ్యోతి విపరీతంగా డబ్బులు సంపాదించిందని... అక్రమంగా సంపాదించి ఇప్పుడు ఎంజాయ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రపంచ యాత్రకుడు.

ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో పెట్టి... శివ జ్యోతి ( Shiva jyothi ) గురించి సంచలన విషయాలను పంచుకున్నాడు. గతంలో వి6 ఛానల్ లో బిత్తిరి సత్తితో.. షోలు చేసి... బతికిన శివ జ్యోతి ఒక్కసారిగా కోటేశ్వరరాలు కావడానికి కారణం బెట్టింగ్ యాప్స్ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం కారణంగా.... ఐదు కోట్ల విలువైన అపార్ట్మెంట్ బంజారాహిల్స్ లో శివ జ్యోతి కొనుగోలు చేసిందని కూడా ఈ వీడియోలో స్పష్టం చేశాడు. బీఎండబ్ల్యూ కారు కూడా కొనుగోలు చేసింది అన్నాడు. అదే సమయంలో తన సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి కూడా.. శివ జ్యోతి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు చేశాడు ప్రపంచ యాత్రకుడు. ఈ డబ్బులన్నీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం... కారణంగానే శివ జ్యోతి సంపాదించిందని మండిపడ్డాడు. ఇలాంటి పనులు శివ జ్యోతి అక్క మానేయాలని... తెలంగాణ యాస భాషలో... కౌంటర్ ఇచ్చాడు ప్రపంచ యాత్రికుడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై శివ జ్యోతి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story