- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Na Autograph: మరోసారి స్క్రీన్‌పై రవితేజ స్వీట్ మెమరీస్.. పోస్ట్ వైరల్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన ‘నా ఆటోగ్రాఫ్: స్వీట్ మెమరీస్’ (Na Autograph) సినిమా ఇప్పటికే అందరికి గుర్తుండే ఉంటోంది.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన ‘నా ఆటోగ్రాఫ్: స్వీట్ మెమరీస్’ (Na Autograph) సినిమా ఇప్పటికే అందరికి గుర్తుండే ఉంటోంది. ఎస్. గోపాలరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2004 వచ్చి ఎంతో మంది యూత్ అండ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా రవితేజ్‌కు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ శివరాత్రి స్పెషల్‌గా ఫిబ్రవరి 22న రీ-రిలీజ్ (rerelease) చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ (Official announcement) చేస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘గుర్తుకొస్తున్నాయి.. మరిచిపోలేని జ్ఞాపకాలతో నిండిన జీవితం.. ప్రతి ఒక్కరికి ప్రేమకథ ఉంటుంది, వారు ఆరాధించే గతం అండ్ఎప్పటికీ చెరగని క్షణాలు ఉంటాయి. నా ఆటోగ్రాఫ్ ఫిబ్రవరి 22న మళ్లీ విడుదలవుతోంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన గోపిక, భూమిక చావ్లా, మల్లిక నటించగా... ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర చేశారు.
A Path Breaking Love Story Re Releasing Again
— Suresh PRO (@SureshPRO_) February 11, 2025
A Must Experience Movie in Theatres #NaaAutograph on 22nd February #Raviteja 😍 pic.twitter.com/KgMHwtyjCq






