- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డ్యూడ్’ వివాదం.. ఇళయరాజాకు రూ.50 లక్షలు చెల్లింపు!
. మైత్రి మూవీ మేకర్స్ ఈ వివాదాన్ని పరిష్కరించినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. గుడ్

దిశ, వెబ్ డెస్క్: గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ సినిమాల కారణంగా రూ.50 లక్షలు చెల్లించేందుకు మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. లెజెండరీ మ్యూజిషీయన్ ఇళయరాజా, ఈ రెండు సినిమాలపై కాపీ రైట్ కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు తాజాగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్యూడ్ సినిమాలో కరోత్త మచ్చాన్ అనే పాటను అనుమతి లేకుండా వాడారని డ్యూడ్ సినిమా బృందంపై కేసు వేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన నుంచి ఇప్పటి వరకు ఈ కేసు నడుస్తూనే ఉంది.
అయితే తాజాగా ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ వివాదాన్ని పరిష్కరించినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు కూడా ఇదే పరిస్థితి. అయితే, తాజాగా ఈ రెండు సినిమాల్లో పాటలు ఉపయోగించినందుకు గాను రూ.50 లక్షలు చెల్లిస్తామని ఇళయ రాజా బృందంతో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలలో కూడా ఒక పాటను వినియోగించారట. దానిపై కూడా మైత్రి మూవీ మేకర్స్ అధికారిక హక్కులు సంపాదించుకుంది. అయితే దీనిపై మైత్రి మూవీ మేకర్స్ నుంచి అధికారి ప్రకటన రావాల్సి ఉంది.






