- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డు ధరకు 'ది ప్యారడైజ్' నైజాం హక్కులు సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్
'ది ప్యారడైజ్' నైజాం హక్కులను మైత్రి సంస్థ రూ.37 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని, ఖయాదు లోహర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఆ తేదీన విడుదల కావడం కష్టమేనని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేసే దిశగా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ఏకంగా రూ.37 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నైజాం ఏరియాలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ స్టేటస్ అందుకోవాలంటే దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతటి వసూళ్లను సాధించాలంటే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం తప్పనిసరి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






