AK64 నుంచి తప్పుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. రంగంలోకి మరో బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థ

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు.

AK64 నుంచి తప్పుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. రంగంలోకి మరో బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థ
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ‘AK64’ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ‘గుడ్ బాడ్ అగ్లీ’ ఫేమ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో చేయనున్నారని టాక్. అజిత్, అధిక కాంబోలో వచ్చిన ఈ గుడ్ బాడ్ అగ్లీ మూవీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో.. ఇప్పుడు AK64 కోసం ఈ ఇద్దరు మరోసారి కలుస్తున్నారని తెలవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈఏడాది నవంబర్‌లో స్టార్ట్ అవుతుందని.. అలాగే వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా దీనిని రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే.. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. ఇదిలా ఉంటే.. AK64 మూవీని టాలీవుడ్‌లో టాప్ నిర్మాణ సంస్థ అయినా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే AK64ను నిర్మించేందుకు తమిళ బడా నిర్మాణ సంస్థ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ రంగంలోకి దిగినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి టాక్. ఇప్పటికే తమిళంలో బడా హీరోలతో మూవీస్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు అజిత్ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధం అయిందట. దీనిపై త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉండనుందని టాక్.

Next Story