- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైథాలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘మా’ ట్రైలర్ అప్డేట్.. భయంకరమైన పోస్టర్‌తో హైప్ పెంచేసిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇక గత ఏడాది కాజోల్, కృతి సనన్ ‘దో పత్తి’ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించింది.ప్రస్తుం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘మా’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ హారర్ చిత్రంలో ఆమె భయంకరమైన అవతారంలో కనిపించనుంది. అయితే ఈ మూవీకి విశాల్ ఫ్యూరియా(Vishal Furia) దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్, దేవ్‌గన్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై అజయ్ దేవ్‌గన్(Ajay Devgn), జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు. ‘మా’ మంచి చెడుల మధ్య జరిగే కాలాతీత యుద్ధాన్ని చూపిస్తుంది. ఉత్కంఠ, తీవ్రమైన నాటకాన్ని అందిస్తుంది.
అయితే ఇందులో రోనిత్ రాయ్(Ronit Roy), ఇంద్రనీల్ సేన్‌గుప్తా, ఖేరిన్ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న హిందీ, తమిళ, తెలుగు, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ‘మా’చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ భారీ హైప్‌ను క్రియేట్ చేశారు. దీంతో సినీ ప్రియులంతా ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, కాజోల్ ‘మా’ సినిమా నుంచి అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మరో నాలుగు రోజుల్లో (మే30)న విడుదల కానున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఓ భయంకరమైన పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇక ఇందులో గాయాలతో ఉండగా.. ఆమె గట్టిగా అరుస్తూ కనిపించింది. ఇక కాజోల్ ఎదురుగా ఓ వ్యక్తి ఎర్రటి కళ్లతో కొమ్ములుతో భయంకరమైన లుక్‌లో కనిపించాడు. ఇక ఈ పోస్టర్‌లో రక్షక్, భక్షక్ రెండూ చేసేది ‘మా’ అని రాసి ఉంది. ఒక తల్లి బిడ్డ కోసం పోరాడినప్పుడు ఆమె దారికి ఏది అడ్డురాదు అనే క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






