- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జుబీన్ గార్గ్ మరణంపై వీడిన మిస్టరీ.. సింగపూర్ పోలీసుల కీలక స్టేట్‌మెంట్
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై సింగపూర్ పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) మరణానికి సంబంధించిన దర్యాప్తు పూర్తయిందని సింగపూర్ పోలీసు ఫోర్స్ (SPF) ఇవాళ కీలక ప్రకటన చేసింది. జుబీన్ గార్గ్ మరణంలో ఎటువంటి కుట్ర లేదా అనుమానాస్పద అంశాలు (Foul play) లేవని పోలీసులు స్పష్టం చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కేసును క్లోజ్ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
కాగా, 2025 సెప్టెంబర్ 19న సింగపూర్ (Singapore)లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన జుబీన్ గార్గ్.. ఈవెంట్‌కు ఒకరోజు ముందు ఓ విలాసవంతమైన నౌకలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలోనే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జుబీన్ తొలుత లైఫ్ జాకెట్ (Life Jacket) వేసుకొని, ఆ తర్వాత తీసేసినట్లు గుర్తించారు. ‘నౌకలో పార్టీ చేసుకున్న సమయంలో జుబీన్ మద్యం మత్తులో ఉన్నారు. నీటిలో ఈత కొట్టిన ఆయన.. నౌకలోకి వచ్చేందుకు ప్రయత్నించడాన్ని సాక్షులు చూశారు. అస్వస్థతకు గురైనట్లు గుర్తించి ఆయన్ను వెంటనే నౌకలోకి తీసుకువచ్చినప్పటికీ కొన్ని గంటల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అధిక రక్తపోటు, మూర్ఛ వ్యాధి ఉందని తేలింది’ అని దర్యాప్తు నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. నౌకలో ప్రత్యక్ష సాక్షులు, బోట్ కెప్టెన్, వైద్య సిబ్బంది సహా మొత్తం 35 మందిని విచారించామని, జుబిన్ గార్గ్ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని గుర్తించామని సింగపూర్ పోలీసులు కోర్టుకు వెల్లడించారు.






