- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kingstone: మిస్టిరీయస్‌గా ‘కింగ్‌స్టోన్’ ట్రైలర్.. ఉత్కంఠను రేకెత్తిస్తున్న సన్నివేశాలు!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) తన 25వ చిత్రం ‘కింగ్‌స్టోన్’ (Kingstone)తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) తన 25వ చిత్రం ‘కింగ్‌స్టోన్’ (Kingstone)తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ (fantasy adventure thriller)గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ (Zee Studio), పార్లల్ పిక్చర్స్ (Parallel Pictures) బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్, ఉమేష్, బన్‌సాల్ నిర్మిస్తుండగా.. కమల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ (First look poster), టీజర్ (Teaser) ఇలా ప్రతి ఒక్క అప్‌డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. దీంతో భారీ అంచనాల మధ్య ఈ మూవీ మార్చి 7న థియేటర్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ‘కింగ్‌స్టోన్’ చిత్రం నుంచి ట్రైలర్ (Trailer) రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఈ కడలి తనలో ఎన్నో సీక్రెట్స్‌ను దాచి పెట్టింది.. కొన్ని సీక్రెట్స్ గాలిలో కలిసిపోగా.. మరికొన్ని మిస్టిరీయస్ సీక్రెట్ మాత్రం సముద్రం లోతులో మిగిలిపోయాయి’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో.. ఎన్నో చావులు, మరెన్నో థ్రిల్లింగ్ విషయాలు సినిమాపై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ప్రజెంట్ ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






