మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌ వివాదం.. తమన్నాను ఉద్దేశిస్తూ నటి సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia)ను మైసూర్ శాండల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కర్ణాటక ప్రభుత్వం నిమామకం చేసిన విషయం తెలిసిందే.

మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌ వివాదం.. తమన్నాను ఉద్దేశిస్తూ నటి సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia)ను మైసూర్ శాండల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కర్ణాటక ప్రభుత్వం నిమామకం చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి పలువురు ఆమె అస్సు వద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. తమన్నాకు కన్నడ రాదు.. కర్ణాటకు ఏ మాత్రం సంబంధం లేని ఆమెను ఎలా బ్రాండ్ అంబాసిడర్ చేస్తారని మండిపడుతున్నారు. లోకల్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ నేతలు కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. నటి రమ్య (దివ్య స్పందన)(Divya Spandana) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది.

‘‘ఇప్పుడు ప్రచారానికి చాలా మార్గాలున్నాయి. అందరికీ సులభంగా తెలియజేయొచ్చు. పాతకాలం నాటి బ్రాండ్ అంబాసిడర్ పద్ధతి ఇప్పుడు అవసరం లేదు. టాక్స్ పేయర్స్ డబ్బులు బ్రాండ్ అంబాసిడర్‌కు ఇవ్వడం తప్పు. ఈరోజుల్లో ప్రజలు వస్తువును కొనడం లేదు. దానికి కారణం సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి నమ్మడం లేదు. ఆ సబ్బు వారిని రాయబారిలా చూపించదని వారికి తెలుసు. ప్రజలు నమ్మకమైన కస్టమర్లుగా మారాలంటే మీ ఉత్పత్తి మంచిగా ఉండాలి. అయితే మనకు ఉత్పత్తి మాత్రమే కాదు దానికి ఓ చరిత్ర కూడా ఉంది.

మైసూర్ శాండల్ సబ్బును ఉపయోగించిన ప్రతి ఒక్కరూ బ్రాండ్ అంబాసిడరే. ప్రతి కన్నడిగ బ్రాండ్ అంబాసిడరే అవుతారు. ప్రతి కన్నడిగుడినీ ప్రపంచానికి తీసుకెళ్లేలా చేయండి. వారు దీన్ని ఉచితంగా చేస్తారు. కన్నడిగుల గర్వానికి ఏది దరిదాపులకు కూడా చేరువకాదు. పెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లు లేరు. ఆపిక్‌కు ఎవరూ లేరు కానీ ఆపిల్ సక్సెస్ ఫుల్‌గా ఉంది. బ్రాండ్ అంబాసిడర్‌తో పాపులారిటీ అమ్మకాలు పెరుగుతాయనుకోవడం తప్పు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story