- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Myrna Menon: ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అద్భుతమైన చిత్రం ఇది.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘క్రేజీ ఫెలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తమిళ బ్యూటీ మిర్నా మీనన్ (Myrna Menon).

దిశ, సినిమా: ‘క్రేజీ ఫెలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తమిళ బ్యూటీ మిర్నా మీనన్ (Myrna Menon). తర్వాత ‘ఉగ్రమ్, బుర్ఖా, జైలర్, నా సామిరంగ’ వంటి సినిమాల్లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ‘డాన్ బాస్కో’ (Don Bosco) చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. రుష్య హీరోగా నటిస్తున్న ఈ మూవీకి పి.శంకర్ గౌరి దర్శకత్వం వహిస్తుండగా.. శైలేష్ రమ నిర్మిస్తు్న్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీలో మిర్నామీనన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘ఈ సినిమా మొత్తం స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ మూవీ చూస్తున్నంత సేపు ఆనాటి జ్ఞపకాలు ప్రతి ఒక్కరికి కళ్ల ముందుకు వస్తాయి. ఎంతో వినోదంతో పాటు భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ మూవీలో మౌనిక, మురళీశర్మ, విష్ణు ఓయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.






