నా ట్విట్టర్ హ్యాక్ అయింది, అవి పెట్టేది నేను కాదు.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్

by Kavitha |
నా ట్విట్టర్ హ్యాక్ అయింది, అవి పెట్టేది నేను కాదు.. ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలా ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైనే ఉన్నాయి.

అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందంతో అదరహో అనిపిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. తాజాగా త్రిష త‌న ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ అయిన కొన్ని పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వాటిని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎక్కువగా సినిమా విషయాలే కనిపించే త్రిష ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో క‌రెన్సీ గురించి చేసిన పోస్టులు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే వీటిని గమనించిన త్రిష వెంటనే అలర్ట్ అయ్యింది.

తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని గ్రహించి.. దానిని వెంట‌నే ఇన్ స్టాగ్ర‌మ్ ద్వారా అభిమానుల‌కు తెలియజేసింది. ‘నా ట్విట్టర్(X) హ్యాక్ అయింది. ఇప్పటి వరకు ఆ పోస్టులు పెట్టింది నేను కాదు. కాబట్టి నా అకౌంట్ మళ్లీ సరిదిద్దే వరకు నా నుంచి ఎలాంటి పోస్ట్‌లు రావు.. ధన్యవాదాలు’ అని తన ఫాలోవర్స్‌కు తెలియజేసింది. కాగా త్రిష సోష‌ల్ మీడియాలు హ్యాక్ కావ‌డం ఇదేం మొదటి సారి కాదు. గతంలో`పెటా` కార్య‌క‌ర్త‌గా ఉన్న త్రిషకు సంబంధించిన సామాజిక మాధ్య‌మాల‌ ఖాతాలను కొందరు హ్యాక్ చేసారు. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. దీంతో ఈ విషయాన్ని గ్రహించిన త్రిష తాను క్రిప్టో గురించి ఎలాంటి పోస్టులు చేయ‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం త్రిష పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.


Advertisement
Next Story