- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా వల్లే మా అమ్మకు పక్షవాతం వచ్చింది.. లైఫ్‌లాంగ్ అంతే.. బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
బిగ్‌బాస్(Bigg Boss) షోతో ఎంతోమంది చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్(Bigg Boss) షోతో ఎంతోమంది చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో శ్రీ సత్య(Sri Sathya) ఒకరు. కెరీర్ స్టార్టింగ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం టీవీ షోల్లో పాల్గొంటూ అలరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా తేజస్వి మదివాడ(Tejaswi Madivada) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాకమ్మ కథలు’(Kakamma Kathalu) అనే షోకు గెస్టుగా వెళ్లింది. అక్కడ తన అమ్మ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘చిన్నప్పటి నుంచి నేను ఏమి పట్టించుకునే టైపు కాదు. తిన్నామా, మన పని మనం చేసుకున్నామా అనే ఉండేదాన్ని. దేన్నీ సీరియస్‌గా తీసుకోలేదు. ఆరేళ్ళ క్రితం అమ్మకు పక్షవాతం వచ్చింది.
అప్పుడే లవ్ బ్రేకప్ అయింది. అక్క పెళ్లి చేసుకొని హైదరాబాద్‌కి వెళ్లిపోయింది. అప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. కరోనా సమయంలో మా అమ్మ హాస్పిటల్‌లో నేను హాస్పిటల్ బయట ఉండేదాన్ని. నాన్నకు షుగర్ ఉండటంతో బయట ఎక్కువ తిరగలేరు. ఆ సమయంలో బాధ్యతల విలువ బాగా తెలిసింది. లైఫ్ లాంగ్ అమ్మకు పక్షవాతం అలాగే ఉంటుంది. అలాంటి సమయంలోనే మనుషులు ఎలా ఉంటారో తెలుసుకున్నా’ అంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






