- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సినిమాలో నా లవర్‌కి ఇంకొంకడితో పెళ్లి అవ్వదు.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘కలర్ ఫోటో’(Colour Photo) సినిమాతో హీరోగా పరిచయమైన టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా ‘హే భగవాన్’(Hey Bhagavan).

దిశ, వెబ్‌డెస్క్: ‘కలర్ ఫోటో’(Colour Photo) సినిమాతో హీరోగా పరిచయమైన టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా ‘హే భగవాన్’(Hey Bhagavan). గోపి అచ్చర(Gopi Achara) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాని నాగరం(Shivani Nagaram) హీరోయిన్‌గా నటిస్తోంది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి(Narendra Reddy) నిర్మిస్తున్న ఈ మూవీకు వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చారు.
ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, యాంకర్ స్రవంతి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 20, 2026న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న సుహాస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను చచ్చిపోను.. నా లవర్‌కి ఇంకొకడితో పెళ్లి కాదు.. అన్నింటికంటే ముఖ్యంగా నేను ఈ మూవీలో పేదవాడిని కాదు’ అని చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడ వారందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. ప్రస్తుతం సుహాస్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






