Mrunal Thakur: ఆ వార్త చూసి నా హార్ట్ బ్రేక్ అయింది.. అస్సలు నమ్మలేకపోతున్నానంటూ మృణాల్ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్(Mukul Dev) మరణించిన విషయం తెలిసిందే.

Mrunal Thakur: ఆ వార్త చూసి నా హార్ట్ బ్రేక్ అయింది.. అస్సలు నమ్మలేకపోతున్నానంటూ మృణాల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్(Mukul Dev) మరణించిన విషయం తెలిసిందే. ‘దస్తక్’(Dastak) సినిమా ద్వారా వచ్చిన ఆయన తెలుగులో రవితేజ(Ravi Teja) కృష్ణ చిత్రంలో విలన్‌గా నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. అయితే గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మే 24న ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ విషయంపై పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మృణాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది.

ఆయన ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఈ వార్త చూసి హార్ట్ బ్రేక్ అయింది. ముకుల్ దేవ్ మరణించాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, మృణాల్ సినిమాల విషయానికొస్తే.. ‘సితారామం’ చిత్రంతో ఓవర్ స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం వరుస మూవీస్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇప్పుడు మృణాల్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. డెకియిట్‌తో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్ చేస్తున్న ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో ముచ్చటిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

Next Story