- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా నాన్న ఇప్పటికీ ఆ పనే చేస్తున్నాడు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్
కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘లవ్ టుడే’(Love Today) సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘లవ్ టుడే’(Love Today) సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. ఆ తర్వాత ‘డ్రాగన్’(Dragon), ‘డ్యూడ్’(Dude) చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా తనదైన ముద్ర వేశారు. అయితే ప్రదీప్ డైరెక్షన్‌తో పాటు హీరోగా నటించబోతున్న మూవీలో టాలీవుడ్ లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary), శ్రీలీల(Sreeleela) హీరోయిన్లుగా నటించనున్నారట. ప్రజెంట్ ఆయన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీలో నటిస్తున్నాడు.
ఇందులో క్రేజీ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ రంగనాథన్ తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మమ్మల్ని చాలా కష్ట పడి పెంచారు. మాకు ఓ జిరాక్స్ షాప్ ఉండేది. దానికి వచ్చే మనీతోనే మమ్మల్ని పోషించారు. అయితే ఇప్పటికీ మా నాన్న మా జిరాక్స్ దుకాణం నడుపుతున్నారు. నేను మా నాన్న గారికి కారు కొనుక్కోమని చెప్పినా కానీ ఆయన బస్సులోనే వెళ్లడానికి ఇష్టపడతారు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






