నేను నటుడు కావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు.. అర్జున్ సర్జా

by Pulgam srinivas |   (  Updated:2026-02-16 07:09:28  IST  )

సీతా పయనం మూవీ ఈవెంట్లో అర్జున్ మాట్లాడుతూ... మా నాన్నగారు కన్నడలో మంచి పేరు పొందిన నటుడు. ఆయన నటుడు అయినా కూడా నేను నటుడిని కావడం మా నాన్నకి ఇష్టం లేదు. నేను పోలీస్ అధికారి కావాలనేది ఆయన కోరిక. నేను మాత్రం నటుడిని అయ్యాను.

నేను నటుడు కావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు.. అర్జున్ సర్జా
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో అర్జున్ సర్జా ఒకరు. ఈయన తాజాగా తన కూతురు ఐశ్వర్య అర్జున్ ను నటిగా పరిచయం చేస్తూ సీతా పయనం అనే సినిమాను రూపొందించాడు. ఈ చిత్రంలో అర్జున్ ఓ కీలకమైన పాత్రలో నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. నిరంజన్ హీరోగా నటించిన ఈ మూవీలో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటించింది. సత్యరాజ్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

ఫిబ్రవరి 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి పర్వాలేదనే స్థాయి టాక్ దక్కింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అందులో అర్జున్ 'సీతా పయనం' మూవీ గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేశాడు. తాజా ఈవెంట్లో అర్జున్ మాట్లాడుతూ... మా నాన్న గారి పేరు శక్తి ప్రసాద్. ఆయన ఎన్నో కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మా నాన్నగారు దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు.

స్వతహాగా ఆయన నటుడు అయినా కూడా మా నాన్నగారికి నేను మాత్రం సినిమాల్లోకి రావడం అసలు ఇష్టం లేదు. ఆయనకు నేను పోలీస్ అధికారి అవ్వాలనే కల ఉండేది. కానీ నేను మాత్రం ఆయన అనుకున్నట్లు పోలీస్ అధికారిని కాలేదు, నటుడిని అయ్యానని అర్జున్ తెలియజేశాడు. సీతా పయనం మూవీ విషయానికి వస్తే... ఈ చిత్రం కేవలం రోడ్ ట్రిప్ జర్నీ కాదు. తండ్రి, కూతురు మధ్య ఉన్న అనుబంధం, కుటుంబ బంధాల బలం తెలిపే భావోద్వేగపూరితమైన చిత్రమే సీతా పయనం అని అర్జున్ చెప్పుకొచ్చాడు.

Next Story