నా ఫ్యాషన్ ఐకాన్ ఎప్పటికీ ఆమె.. స్టార్ కిడ్ ఖుషి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) చిన్న కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

నా ఫ్యాషన్ ఐకాన్ ఎప్పటికీ ఆమె.. స్టార్ కిడ్ ఖుషి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) చిన్న కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషీ కపూర్ ఫ్యాషన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘ఫ్యాషన్ కాలాతీతమని నేను భావిస్తాను. ఎందుకంటే అప్పట్లో నేను మా అమ్మ శ్రీదేవి డ్రెస్సులు ధరించేదాన్ని.. ఇప్పుడు మా అక్క జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బట్టలు ధరిస్తాను. అయినా.. గ్లామర్, ఫ్యాషన్ అనేది ఎలాంటి బట్టలు ధరించారు అనే దానిలో కాదు.. ఎలా ధరించారు అనే దానిలో కనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. ఇక మీ అభిప్రాయం ప్రకారం నిజమైన ఫ్యాషన్ ఐకాన్ ఎవరు అని ప్రశ్నించగా.. దానిపై స్పందించిన ఖుషీ నవ్వుతూ ‘నేను ఎల్లప్పుడూ మేరే లియే.. మేరీ బడి బెహెన్ జాన్వి అని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story