- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ హీరోతో నా ఎనర్జీ ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది.. నేషనల్ క్రష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన ఫస్ట్ మూవీతోనే నేషనల్ క్రష్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీతో ఏకంగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే రీసెంట్‌గా ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘పుష్ప2’(Pushpa-2) వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మిక కూడా తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.
అలాగే తన అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసింది. దీంతో ఈ భామకు ఎడతెరిపి లేకుండా ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఛావా’(Chhaava), ‘రెయిన్ బో’(Rainbow), ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ‘VD-14’, ‘సికిందర్’(Sikander) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ కొన్ని రోజులకే క్యాన్సల్ చేసుకుంది. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన కొన్ని సినిమాల్లో నటించి అతనితో ప్రేమలో పడింది.
ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు ఎప్పటినుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరు కలిసి వేకేషన్స్‌కి వెళ్ళడం, విజయ్ ఇంటికి రష్మిక వెళ్లడం వంటి పలు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. కానీ, ఈ రిలేషన్‌పై వారు ఇప్పటివరకు స్పందించలేదు. మరి ముందు ముందు అయినా స్పందిస్తారా లేదా చూడాలి.
ఇదిలా ఉంటే.. విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్న జంటగా లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ ‘ఛావా’(Chaava). ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన కో యాక్టర్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “ఇటీవల నేను చేసిన సినిమాల్లోని కో స్టార్స్ అందరూ ఎంతో మంచి వ్యక్తులు. స్నేహభావంతో, ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సర్‌తో నా ఎనర్జీ ఫర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది.
ఆయనతో నటించడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇక రణబీర్(Ranbeer)కు నాకు నాన్సెన్స్ నచ్చదు. కేవలం పాత్రల గురించి తప్ప ఇతర విషయాలేవీ మాట్లాడుకోం. అంతా ప్రొఫెషనల్‌గా ఉంటాం. చివరికి విక్కీ కౌశల్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. వాళ్లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన్న చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.