- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడు.. బెయిలివ్వండి: కోర్టుకు నటుడు శ్రీరామ్ అభ్యర్థన
డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసు (Drug Trafficking Case)లో నటుడు శ్రీరామ్ (Sriram) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసు (Drug Trafficking Case)లో నటుడు శ్రీరామ్ (Sriram) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి డ్రగ్స్ అమ్మలేదని తెలిపాడు. తెలిసిన వారి నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేశానని ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టాడు. తాను సెలబ్రిటీ అయి ఉండి అలా డ్రగ్స్ తీసుకోవడం తప్పేనని అంగీకరించాడు. ప్రస్తుతం తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని.. సంరక్షకుడిగా ఆ బాధ్యత తనపై ఉందని అన్నాడు. తనకు వెంటనే కేసులో బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. కాగా, సోమవారం రాత్రి అరెస్ట్ అయిన శ్రీరామ్‌ను పోలీసులు ఎగ్మోర్ కోర్టు (Egmore Court)లో హాజరుపరిచారు. ఎనిమిది గంటల పోలీసుల విచారణ అంశాలతో పాటు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శ్రీరామ్‌కు జూలై 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధిస్తూ తీర్పును వెలువరించారు.






