- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పుష్ప 2’ వల్ల నిరాశే మిగిలింది..
సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దివి వాద్య.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ వెండితెరపై కూడా మెప్పిస్తుంది.

దిశ, సినిమా: సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న దివి వాద్య.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ వెండితెరపై కూడా మెప్పిస్తుంది. నటనపై ఆసక్తితో వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుని సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ‘పుష్ప 2’లో కూడా నటించింది. ఇందులో దివి రిపోర్టర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. పుష్ప 2 చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘పుష్ప 2 కథ నాకు చెప్పినప్పుడు నా పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ మొత్తం నా పాత్రతోనే ఉండటంతో.. ఇందులో నా పాత్ర ఎంతో అద్భుతంగా ఉండబోతుందని ఎన్నో అంచనాలు పెట్టుకున్నాను. ఎన్నో ఆశలతో నా ఫ్రెండ్స్ అందరితో కలిసి థియేటర్‌కు వెళ్లా. సినిమాలో నాకు సంబంధించి కేవలం రెండు, మూడు సీన్లు మాత్రమే కనిపించడంతో చాలా ఫీల్ అయ్యా. ఈ సినిమా షూటింగ్ కోసం 20 రోజులు షూటింగ్‌లో కూడా పాల్గొన్నా.. డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశా. కానీ తీరా సినిమా విడుదల చేసేసరికి నా పాత్ర మొత్తం ఎడిటింగ్‌లో తీసేశారు. చాలా బాధ పడ్డాను’ అని ఆవేదన వ్యక్తం చేసింది దివి.






