- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూవీలో నా క్యారెక్టర్ మీ ఊహలకు మించి ఉంటుంది.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘సీతారామం’(Seetharamam) మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది తన ఫస్ట్ సినిమాతోనే స్టార్ డమ్ అందుకుంది. ట్రెడిషనల్ లుక్‌లో కుర్రకారును ఫిదా చేసేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా నాని(Nani) సరసన ‘హాయ్ నాన్న’(Hai Nanna) మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే చివరిగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రజెంట్ తెలుగులో అడివి శేష్(Adivi Sesh)తో ‘డెకాయిట్’(Decoit) మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లోనూ ఈ చిన్నది వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్‌గా రాణిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ సౌత్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘అసలు దక్షిణాది సినిమాల్లో నటించడం అనేది నా ప్రణాళికలో లేదు. నేను సౌత్ సినిమాల్లో నటిస్తానని అస్సలు అనుకోలేదు కూడా. ఓ విధంగా అది నాకు అనుకోకుండా దొరికిన అదృష్టం. ‘సీతారామం’ తర్వాత నా విషయంలో బాలీవుడ్ దర్శక, నిర్మాతల దృక్కోణం కూడా మారింది.
అందుకే తెలుగు సినిమాకు ఎప్పుడూ రుణపడి ఉంటా. వచ్చే ఏడాది ‘డెకాయిట్’తో మరోసారి టాలీవుడ్ తెరపై కనిపించబోతున్నా. ఆడియన్స్‌కి స్వీట్ షాక్ ఇచ్చే సినిమా ఇది. ఓ కొత్త కథను తెరపై చూస్తారు. నా క్యారెక్టర్ మీ ఊహలకు మించి ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More..
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ ప్లేస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!






