- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోతో ఆ పని చేయడం వల్లే నా కెరీర్ నాశనం అయింది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సాధారణంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించాలంటే అందంతో పాటు టాలెంట్ కూడా అవసరం.

దిశ, సినిమా: సాధారణంగా హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాణించాలంటే అందంతో పాటు టాలెంట్ కూడా అవసరం. కొన్ని సార్లు ఈ రెండు ఉన్నా అదృష్టం కలిసి రాక సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. అయితే ఇది మనం ఎంచుకునే కథలపై కూడా ఆధారపడి కూడా ఉండొచ్చు. కొంతమంది యంగ్ హీరోయిన్స్ ఒకే ఒక్క చిత్రంతో ఓవర్ నైట్ స్టార్స్‌గా మారిన సందర్భాలు లేకపోలేదు. అలాగే మరికొంత మంది ఒక్క సినిమాతోనే కెరీర్ నాశనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మడు కూడా అలాగే అంటుంది. ఆ స్టార్ హీరోతో మూవీ చేయడం వల్లే నా జీవితం నాశనం అయింది అని. మరి ఇంతకీ ఆ నటి ఎవరు ఏంటి విశేషాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..
‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’(Malligadu Marriage Bureau) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనో చిత్ర(Mano Chitra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘నాటుకోడి’(Natukodi) , ‘జై సేన’(Jai Sena) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడు హీరో అజిత్(Ajith) సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. హీరో అజిత్ చిత్రం ‘వీరం’(Veeram)లో నటిస్తున్నప్పుడు తనకు జరిగిన ఒక చేదు సంఘటన గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘అజిత్ సినిమా వీరం షూటింగ్ చాలా చోట్ల భారీ స్థాయిలో జరిగింది. ఆ సినిమాలో నేను బాగా నటించి పెద్ద హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటానని అనుకున్నాను. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నాకు చాలా ప్రశ్నలు తలెత్తాయి. దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు, తమన్నా సినిమా సగంలోనే చనిపోయింది. ఆ తర్వాత నువ్వు అజిత్ సరసన నటించాలి అని అన్నాడు. కానీ నేను షూటింగ్‌కి వచ్చిన తర్వాతే అతను చెప్పింది పూర్తిగా అబద్ధమని నాకు అర్థమైంది.
ఆ తర్వాత ఆ షూటింగ్ స్పాట్‌లో ఉండటం నాకు నచ్చలేదు. నేను వెళ్ళి పోవాలని నిర్ణయించుకున్నాను, కానీ అందరూ నాకు సర్దిచెప్పి అక్కడే ఉండనిచ్చారు. కొన్ని రోజుల తర్వాత, మూవీ టీమ్ నాకు ఫోన్ చేసి, ఆ సినిమాలో కేవలం 2 రోజులు నటించమని అడిగారు. నేను ఆ మూవీలో నటించటానికి ఏకైక కారణం అజిత్ సార్. నేను ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాల్లో, నా తమిళ సినీ కెరీర్‌పై అత్యంత ప్రభావం చూపిన సినిమా వీరం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మనో చిత్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వీరం 2014 లో విడుదలై ఓకే ఓకే అనిపించుకుంది. ఇక దీనికి సిరుతై శివ దర్శకత్వం వహించారు.






