- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా బాడీ నా ఇష్టం.. నాకు లేని నొప్పి మీకెందుకు.. దుమారం రేపుతున్న స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) గారాల పట్టి శృతి హాసన్(Sruthi Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) గారాల పట్టి శృతి హాసన్(Sruthi Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు నటిగా, సింగర్‌గా అదరగొడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు స్వయంగా మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘కూలీ’(Coolie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు నాకు నా ముక్కు నచ్చేది కాదు. అందుకే సర్జరీ చేయించుకున్నాను.
అలాగే ముఖం ఇంకా అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా చేయించుకున్నా. దీంట్లో దాచిపెట్టడానికి ఏమీ లేదు. చాలా ఇంటర్వ్యూల్లో నేను ఈ విషయం చెప్పాను. అయితే కొంతమంది మాత్రం దీని గురించి బయటకు చెప్పకుండా దాచుకుంటారు. నేను వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. అలాగే నాలాగే దైర్యంగా బయటకు చెప్పే వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో వయసు పైబడ్డాక ఫేస్ లిఫ్ట్ కూడా చేయించుకుంటానేమో చూడాలి. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా శరీరం నా ఇష్టం. ఇతరులకు ఇబ్బంది లేనప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది. అయినా నాకు లేని నొప్పి మీకెందుకు” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






