ఆ నటుడితో 2 ఏళ్ళు డేటింగ్‌.. బయటపడ్డ దీపికా బండారం ?

by velandi.Saikiran |   (  Updated:2025-06-09 12:13:35  IST  )

సినిమా ఇండస్ట్రీ ( Film industry) అంటేనే పెద్ద సముద్రం. ఇందులో హిట్స్, ఫ్లాప్స్ తో హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్లు కూడా

ఆ నటుడితో 2 ఏళ్ళు డేటింగ్‌.. బయటపడ్డ దీపికా బండారం ?
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీ ( Film industry) అంటేనే పెద్ద సముద్రం. ఇందులో హిట్స్, ఫ్లాప్స్ తో హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్లు కూడా ఉంటాయి. ఇందులో కొంతమంది రిలేషన్ పెట్టుకొని... పెళ్లి చేసుకుంటే మరి కొంత మంది.. పని అయిపోయాక వదిలేస్తారు. లేదా చిన్న చిన్న కారణాలవల్ల.. బ్రేకప్ చెప్పుకుంటారు. అయితే తాజాగా..దీపికా పదుకొనే ( Deepika Padukone) గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ హీరో ముజమ్మిల్ ఇబ్రహీం.

ఢోకా సినిమాతో స్టార్ హీరోగా మారిన... ముజమ్మిల్ ఇబ్రహీం ( Muzammil Ibrahim) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని... దీపికా పదుకొనే గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. దీపిక పదుకొనేతో 2018 వరకు ప్రేమాయణం నడిచిందని వెల్లడించాడు. దాదాపు తామిద్దరం రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నట్లు స్పష్టం చేశాడు ముజమ్మిల్ ఇబ్రహీం.

తనకు మొదట దీపిక పదుకొనే ప్రపోజ్ చేసిందని కూడా స్పష్టం చేశాడు. దీపిక పదుకొనే తోనే తన మొదటి లవ్ ప్రారంభమైందని వెల్లడించాడు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దీపిక పదుకొనేను నేనే వదిలేసానని.. బాంబు పేల్చాడు ముజమ్మిల్ ఇబ్రహీం. దీంతో ఇప్పుడు ముజమ్మిల్ ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

Next Story