Thaman: థియేట‌ర్ లో బాలయ్య అవ‌తారం చూస్తే, దండం పెడతారు

by velandi.Saikiran |

ఆ శివయ్య చేయించుకున్నాడని, అఖండ అనేది ఒక గుడి అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా అదృష్టం

Thaman: థియేట‌ర్ లో బాలయ్య అవ‌తారం చూస్తే, దండం పెడతారు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ఆఖండ 2. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా ఈవెంట్ కు నందమూరి బాలయ్య, హీరోయిన్ సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, దర్శకుడు బోయపాటి శ్రీను హాజరై కనువిందు చేశారు. ఇక ఈ ఈవెంట్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడారు. థియేటర్ లో అఖండ 2 సినిమా ప్రభంజనం సృష్టించబోతుందని వెల్లడించారు. ఈ సినిమా చేయాలంటే చాలా బలం కావాలని, ఈ మూవీ చేసింది తాను కాదంటూ షాక్ ఇచ్చారు.

స్వయంగా ఆ శివయ్య చేయించుకున్నాడని, అఖండ అనేది ఒక గుడి అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా అదృష్టం కావాలని తమన్ స్పష్టం చేశారు. ఇక శివుడు రూపంలో వచ్చినప్పుడు, బాలయ్యను థియేటర్ లో చూసి అందరూ నిలబడి దండం పెడతారు అంటూ వ్యాఖ్యానించారు. అంతలా గూస్ బంప్స్ ఉంటాయని తమన్ చెప్పే ప్రయత్నం చేశారు. అఖండ కంటే అఖండ 2 సినిమా మూడింతలు ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. బాలయ్య బాబుతో వరుసగా సినిమాలు చేయడం అదృష్టమని పేర్కొన్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

డిసెంబర్ 5వ తేదీన ఎవరు కూడా బాక్సులు పగిలిపోయి, స్పీకర్లు పేలిపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ముందే మీ స్పీకర్లు సర్వీస్ చేసుకొని పెట్టుకోండని సూచనలు చేశారు. బోయపాటి గారు నిజంగా అదిరిపోయే సినిమా తీశారని కొనియాడారు. డిసెంబర్ 5 బాలయ్య గారితో మరో బ్లాక్ బస్టర్ హిట్. అందరం సక్సెస్ మీట్ లో కలుద్దాం అంటూ వెల్ల‌డించారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. కాగా నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ఆఖండ 2లో సంయుక్త మీన‌న్ హీరోయిన్ కాగా, ఆది విల‌న్ గా క‌నిపించ‌నున్నారు.

Next Story