- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Thaman: తెలుగు సినిమాను 'OG' మరో స్థాయిలో నిలబెడుతుంది.. మ్యూజిక్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కన్నులతో ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సెప్టెంబరు నెలలో థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా, ముంబయి మాఫియా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో పవర్ స్టార్ ఒక క్రూరమైన గ్యాంగ్ స్టర్ రోల్‌లో కనిపించనున్నారని టాక్.
ఇక ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. ఈయనకు తెలుగులో ఇదే మొదటి సినిమా. ప్రియాంక అరుల్ (Priyanka Arul) కథానాయికగా తన ప్రతిభ కనబర్చనుంది. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించగా.. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ నెటిజన్లలో భారీ హైప్ ను పెంచాయి.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మ్యూజిక్ దర్శకుడు తమన్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచే కామెంట్స్ చేశారు. ‘తెలుగు సినిమాను 'OG' మరో స్థాయిలో నిలబెడుతుంది. వెరీ ఫాస్ట్ ఫార్వార్డ్ థింకింగ్ మూవీ. ఓజీలో కూడా దాదాపు ఆరు, ఏడు పార్టులు చేసేశాం’ అని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు మ్యూజిక్ డైరెక్టర్.