రాపో 23లోకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ.. ఈ పిచ్చి ప్రపంచంలోకి స్వాగతం అంటూ రామ్ పోస్ట్

by Chukka Sudharani |

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘RAPO23’.

రాపో 23లోకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ.. ఈ పిచ్చి ప్రపంచంలోకి స్వాగతం అంటూ రామ్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘RAPO23’. రామ్ స్వీయా డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఎక్కడా రాజీ పడకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. రామ్ ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఈ ప్రాజెక్ట్‌ను అత్యున్నత నిర్మాణ విలువలతో, భారీ స్కేల్‌లో ప్లాన్ చేస్తుండగా.. తాజాగా ‘RAPO23’తో మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీ.ఎస్ జాయిన్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీ.ఎస్ తన ఎక్స్ వేదికగా.. ‘RAPO23 చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండటం చాలా సంతోషంగా ఉంది.. ఈ అద్భుతమైన బృందంతో కలిసి ఏదైనా ప్రత్యేకమైనదాన్ని రూపొందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రామ్‌తో ఉన్న ఫొటో షేర్ చేశాడు. అయితే.. ఈ ట్వీట్‌పై రామ్ స్పందిస్తూ.. ‘డియర్ బ్రదర్.. ఈ పిచ్చి ప్రపంచంలోకి స్వాగతం’ అని రిప్లై ఇచ్చాడు.

Next Story