శంబాల మ్యూజిక్‌పై సంగీత దర్శకుడి కామెంట్స్

by Sujitha Rachapalli |

వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుండగా..

శంబాల మ్యూజిక్‌పై సంగీత దర్శకుడి కామెంట్స్
X

దిశ, సినిమా : వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘‘శంబాల’లో చాలా థీమ్స్ ఉంటాయి. దర్శకుడు కథ చెప్పిన నెక్ట్స్ డే నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. డైరెక్టర్ యుగంధర్‌కి సౌండింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన డైరెక్షన్ టీం కూడా ఎంతో ప్యాషనేట్‌గా ఉంటుంది. ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. నేను ఎన్నో థ్రిల్లర్స్‌కు పని చేశాను. కానీ ‘శంబాల’ లాంటి సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్‌కు పని చేయడం కొత్తగా అనిపించింది. ప్రతీ ఒక్కరి దగ్గర అన్ని రకాల ఇన్‌స్ట్రూమెంట్స్ ఉంటాయి. నేను మాత్రం కొత్తగా, వెరైటీగా సౌండ్‌ను క్రియేట్ చేయాలని చూస్తుంటాను. ఇలాంటి చిత్రాలకు ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చో పెట్టాలంటే సౌండ్ మరింత గొప్పగా ఉండాలి. సౌండ్‌తో ఆడియన్స్‌ని ఎక్కువగా మిస్ లీడ్ చేయాల్సి ఉంటుంది. కథలో భాగంగా వచ్చే నాలుగు పాటలు అద్భుతంగా ఉంటాయి. మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తుంది. నేను చిన్నప్పటి నుంచి మన మైథలాజికల్ స్టోరీస్ వింటూనే పెరిగాను. ఇప్పుడు ఆ జానర్‌లో వచ్చిన కథకు మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని తెలిపాడు.

Next Story