- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాంపియన్.. ఓ యూనిక్ స్టోరీ
‘ఛాంపియన్’ చాలా యూనిక్ కథ అని తెలిపాడు ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. ఇందులో సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని తెలిపాడు. ఇండిపెండెన్స్ టైంలో జరిగే

దిశ, సినిమా : ‘ఛాంపియన్’ చాలా యూనిక్ కథ అని తెలిపాడు ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. ఇందులో సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని తెలిపాడు. ఇండిపెండెన్స్ టైంలో జరిగే కథకు పాటలు అందించడం.. చాలా ప్రత్యేకంగా అనిపించిందని.. ఇందులో ఎక్కువగా నిజాం బ్యాక్ డ్రాప్ ఉంటుందని.. నిజాం కాలంలో గ్రామాలు, ప్రజలు, ఎమోషన్స్‌ని చాలా విభిన్నంగా చూపించడం జరిగిందని వివరించాడు. పీరియడ్ సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టమన్న మ్యూజిక్ డైరెక్టర్.. ఒక టైం నుంచి మరో టైంలోకి వెళ్లి.. ఒక కాలాన్ని చూడడమనేది ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందన్నాడు. ‘మహానటి’ సినిమా కూడా అలాంటి అనుభూతిని ఇచ్చిందని చెప్పాడు. ‘ఛాంపియన్’ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి తెలంగాణ జానపదంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్‌ను మిళితం చేసి ఒక జానెర్ క్రియేట్ చేసే అవకాశం ఈ కథ కల్పించిందని.. ఇలాంటి మ్యూజిక్ క్రియేట్ చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశానన్నాడు. ఇందులో ఎమోషన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయని తెలిపాడు. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ చేస్తున్న సినిమాకు ప్రదీప్ అద్వైతం డైరెక్టర్ కాగా జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.






