ఆ నారీ ఈ నారీ నడుమ మురారి ఫుల్ సాంగ్ రిలీజ్.. ఇద్దరు భామల మధ్యలో నలిగిపోతున్న టాలీవుడ్ హీరో

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-10 08:45:26  IST  )

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఆ నారీ ఈ నారీ నడుమ మురారి ఫుల్ సాంగ్ రిలీజ్.. ఇద్దరు భామల మధ్యలో నలిగిపోతున్న టాలీవుడ్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ అంచనాలను పెంచగా.. తాజాగా ఈ మూవీ నుంచి ఆ నారీ ఈ నారీ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘వాల్యూమ్ పెంచండి.

ఇది చాలా స్పెషల్.. ఆ నారి ఈ నారి నడుమ మురారి పూర్తి వీడియో పాట ఇప్పుడే విడుదల అయింది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో శర్వానంద్ మధ్యలో ఉండగా ట్రెడిషన్‌లో లుక్‌లో సంయుక్త మీనన్.. బోల్డ్ లుక్‌లో సాక్షి ఇద్దరూ హీరో చేతిని నా వాడంటే నావాడు అనేలా పట్టుకున్నారు కాగా ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Read More..

భర్త మహాశయులకు విజ్ఞప్తి : ప్రేక్షకులకు సినిమా సర్‌ప్రైజ్ ఇస్తుంది.. హీరోయిన్లు



Next Story