Soubin Shahir : ముంజమ్మల్ బాయ్స్ ఫేమ్ నటుడు సౌబిన్ షాహిర్ అరెస్ట్

by Muthe.Rajitha |

Soubin Shahir : ముంజమ్మల్ బాయ్స్ ఫేమ్ నటుడు సౌబిన్ షాహిర్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : మలయాళ సినిమా 'ముంజమ్మల్ బాయ్స్'(Munjammal Boys) ఫేమ్ నటుడు సౌబిన్ షాహిర్(Soubin Shahir) ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు, నిర్మాత అయిన సౌబిన్ షాహిర్ ను కేరళలోని కొచ్చి మరడు పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. ఓ సినిమా నిర్మాణంలో రూ. 7 కోట్ల మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టు చేయగా.. కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ముంజమ్మల్ బాయ్స్ సినిమా కోసం తన వద్ద నుంచి రూ.7 కోట్లు తీసుకొని ఎగవేసినట్టు సిరాజ్ వలియతర అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో సౌబిన్ తోపాటు, ఆయన తండ్రి బాబు షాహిర్, సహ నిర్మాత షాన్ ఆంటోనీలపై 2024 మేలో కేసు నమోదైంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే వాంగ్మూలం నమోదు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Next Story