- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లికొడుకు, ఇష్టమైన హీరో గురించి క్లారిటీ ఇచ్చిన ముమైత్ ఖాన్.. అవే ఎనర్జీనిస్తాయంటూ కామెంట్స్
ఐటెమ్ సాంగ్స్‌లో స్టెప్పులేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది నటి ముమైత్ ఖాన్.

దిశ, వెబ్‌డెస్క్: ఐటెమ్ సాంగ్స్‌లో స్టెప్పులేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది నటి ముమైత్ ఖాన్. సినిమాల్లో పలు రోల్స్‌లో నటించినప్పటికీ ఈ బ్యూటీ స్పెషల్ పాటలతోనే మంచి పేరు దక్కించుకుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాలో ఐటెమ్ సాంగ్ లో కనిపించి.. కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. అలాగే ఎవడైతే నాకేంటి, మైసమ్మ ఐపీఎస్, ఆరేషన్ దుర్యోధన, నేనింతే వంటి మూవీల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకుంది.
అయితే ఈ బ్యూటీ తాజాగా హైదరాబాద్ యూసఫ్‌గూడలోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీలో నిర్వహించిన ఈవెంటుకు హాజరైంది. ఈ అకాడమీకి డైరెక్టర్‌గా కూడా చేస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ముమైత్‌కు పెళ్లిపై ప్రశ్న ఎదురవ్వగా ఈ విధంగా బదులిచ్చింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? చేసుకోరా? అనే ప్రశ్నకు.. ‘ తెలియదు అని చెప్పుకొచ్చింది. మరీ ఎలాంటి వరుడు కావాలని అడగ్గా.. తెలియదనే చెప్పింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం బిజినెస్‌పైనే అని వెల్లడించింది.
ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు.. అందరి హీరోలతో వర్క్ చేశాను కానీ.. ప్రజెంట్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఫేవరెట్ హీరో అని తెలిపింది. హిందీలో పుష్ప చిత్రం వీక్షించానని ముమైత్ పేర్కొంది. ఇక డ్యాన్స్ అకాడమీ లాంటివి పెట్టాలన్న థాట్ ఏం రాలేదని.. కానీ హైదరాబాదులో సెటిల్ అవ్వడం ఇష్టం లేదని.. ట్రావెల్ చేయడమంటే ఇష్టమని వివరించింది. అలాగే తన అమ్మ గురించి మాట్లాడింది. తన మదర్ చాలా మంచివారని.. దేవుడు ఎప్పుడు అందరికీ మంచే చేస్తారని చెప్పేవారని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది.
ప్రెజెంట్ తను సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా నటి ‘ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే’ సాంగ్ గుర్తుచేసుకుని.. ఇప్పటికీ చాన్స్‌లు వస్తే ఐటెమ్ సాంగ్‌లు చేస్తానని.. ఆ పాటలు ఎనర్జీనిస్తాయని క్లారిటీ ఇచ్చింది. అలాగే మ్యూజిక్ అంటే ఇష్టమని.. ప్రస్తుతం మూవీల్లో చాలా మార్పులు వచ్చాయని, చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లు అయిపోయారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






