చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు ముమైత్ ఖాన్.. కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ.. ఇప్పుడెలా ఉందంటే?

by Kodari Anjali |   (  Updated:2025-02-23 14:19:14  IST  )

‘ఇప్పటికింకా నా వయస్సు నిండ పదహారే’ అంటూ ఐటెమ్ సాంగ్‌కు స్టెప్పులేసి ఫుల్ ఫేమ్ దక్కించుకుంది నటి ముమైత్ ఖాన్.

చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు ముమైత్ ఖాన్.. కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ.. ఇప్పుడెలా ఉందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇప్పటికింకా నా వయస్సు నిండ పదహారే’ అంటూ ఐటెమ్ సాంగ్‌కు స్టెప్పులేసి ఫుల్ ఫేమ్ దక్కించుకుంది నటి ముమైత్ ఖాన్. తర్వాత కూడా పలు స్పెషల్ సాంగ్స్‌లో గ్లామర్ స్టెప్పులేసి.. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల్లో పలు పాత్రల్లో కూడా నటించి.. తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ బ్యూటీ సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. చాలా రోజుల తర్వాత ముమైత్ ఖాన్ మీడియా ముందుకొచ్చింది. ఇన్ని డేస్ తర్వాత ఈ భామ కనిపించడంతో అభిమానులు కాస్త హ్యాపీ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా యూసుఫ్‌గూడలోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీలో ఓ సదస్సు నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముమైత్ ఖాన్ హాజరయ్యింది. వీలైక్ అకాడమీ డైరెక్టర్ అలాగే ఫౌండర్స్ కెయిత్, ఆర్టిస్టులు జ్యోతి, జావేద్, అక్సఖాన్, సింగర్ రోల్ రౌడా, మాస్టర్ జోసఫ్ వంటి వారు హాజరయ్యారు. ముమైత్ ఖాన్ కూడా ఈ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సినిమాలకు దూరమవ్వడానికి కారణం వెల్లడించింది.

తనకు యాక్సిడెంట్ అయ్యిందని.. తద్వారా మూవీల్లో నటించడం మానేశానని తెలిపింది. కానీ సినీ పరిశ్రమకు మళ్లీ వస్తానని చెప్పి ఫ్యాన్స్‌‌ను ఖుషి చేసింది. ప్రస్తుతం బిజినెస్‌లోకి అడుగుపెట్టానని.. కానీ మేకప్‌లో సౌత్ అండ్ నార్త్ వేరు వేరుగా కాకుండా రెండింటినీ కలిపితే కొత్త ఔట్‌పుట్ వస్తుందని కొత్తగా ఆలోచించి మాట్లాడింది. మేకప్‌‌లో అప్డేట్ వర్షన్ తీసుకొస్తానని మీడిమా ముందు ముమైత్ మాట్లాడింది. ప్రస్తుతం ఈ భామ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story