- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ–శ్రీవిష్ణు కాంబో మూవీకి ముహూర్తం ఫిక్స్.. అన్ని రోజులు నాన్‌స్టాప్ షూటింగ్
రవితేజ–శ్రీ విష్ణు కాంబో చిత్ర షూటింగ్ ఆగస్టులో ప్రారంభించి, 150 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి హాసిత్ గోలి దర్శకత్వం వహించనుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. సంక్రాంతికి పెద్దగా సమయం లేకపోవడంతో చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 150 రోజుల పాటు నాన్ స్టాప్ గా చిత్రీకరణ నిర్వహించి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. మేకర్స్ ప్రణాళికలు అనుకున్నట్లుగా అమలైతే ఈ మల్టీస్టారర్ సంక్రాంతి రేసులో నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.






