పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. ఆసక్తికర ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-28 12:58:49  IST  )

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath), కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబినేషన్‌లో హైలీ యాంటిసిపేడెట్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.

పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. ఆసక్తికర ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath), కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబినేషన్‌లో హైలీ యాంటిసిపేడెట్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇందులో టబు, రాధికా ఆప్టే(Radhika Apte), విజయ్ కుమార్(Vijay Kumar) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ కోసం హైదరాబాద్, చెన్నైలో పలు ప్రాంతాలు చూస్తున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story