- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ చిత్రం నిర్మాతగా నా స్థాయిని మరింత పెంచుతుంది.. నిర్మాత కామెంట్స్‌తో సినిమాపై మరింత హైప్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్‌ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా ‘తీయవర్ కులై నడుంగ’ తెలుగులో ‘మఫ్టీ పోలీస్’ రేపు గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది.

దిశ, సినిమా: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్‌ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా ‘తీయవర్ కులై నడుంగ’ తెలుగులో ‘మఫ్టీ పోలీస్’ రేపు గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్‌పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని... తెలుగులో ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ.. శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత ఎన్. బాలాజీ.. ఈ సినిమా నిర్మాతగా తన స్థాయిని మరింత పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
‘ఒక రచయిత హత్య నేపథ్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుంది. ఇటీవలకాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించడం, సదరు వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం ఈ చిత్రం ప్రత్యేకత. యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ అలియాస్ భాగ్యంలకు తెలుగునాట ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో ‘మఫ్టీ పోలీస్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. ఇందులో యాక్షన్‌తోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.






