- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MS Dhoni: మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న ధోనీ.. కరణ్ జోహర్ పోస్టు వైరల్
by Vennela |

X
దిశ, వెబ్ డెస్క్: MS Dhoni: భారత క్రికెటర్ MS Dhoni వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ పోస్టు చేశారు. త్వరలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ రొమాంటిక్ రోల్లో కనిపించబోతున్నాడు అంటూ తన ఇన్ స్టా స్టోరీలో కరణ్ జోహార్ రాసుకొచ్చారు.
ఈ పోస్టుకు కరన్ ఓ వీడియో కూడా జత చేశారు. అందులో ఎంఎస్ ధోనీ లవ్ సింబల్ బెలూన్ పట్టుకుని కనిపించారు. దీంతో ఆ స్టార్ క్రికెటర్ ను కరణ్ బాలీవుడ్ లో లాంచ్ చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లోకి తలా ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ఓ యాడ్ షూటింగ్ కావచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Next Story