Mrunal Thakur: పిల్లలు అంటే చాలా ఇష్టం.. కానీ ప్రస్తుతం ప్లానింగ్ లేదు.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. తాజాగా కపిల్‌ శర్మతో చేసిన మృణాళ్‌ ఠాకూర్‌ చిట్‌చాట్‌లో పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Mrunal Thakur: పిల్లలు అంటే చాలా ఇష్టం.. కానీ ప్రస్తుతం ప్లానింగ్ లేదు.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. తాజాగా కపిల్‌ శర్మతో చేసిన మృణాళ్‌ ఠాకూర్‌ చిట్‌చాట్‌లో పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అంతేకాదు తల్లి కావడం అనేది నాకు ఎప్పటి నుంచో కల. అయితే ప్రస్తుతం మాత్రం పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదు.. ప్రజెంట్ నా ఫోకస్ మొత్తం కెరీర్‌పైనే పెట్టాను. ఫస్ట్ ఓ యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక అప్పుడు పెళ్లి లాంటివి ప్లాన్ చేసుకుంటాను. ప్రస్తుతం అయితే ఏం లేదు’ అని తెలిపింది. ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ‘డెకాయిట్’ చిత్రం చేస్తుంది.

అడివిశేష్‌ హీరోగా నటిస్తున్న ఈ హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌ ఇండియా థ్రిల్లర్‌ మూవీకి షానియల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకు సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఇది డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా విడుదల కానుంది. దీంతో పాటు బాలీవుడ్‌లో ‘సన్నాఫ్ సర్దార్-2లో కూడా ఈ బ్యూటీ నటిస్తుంది. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఆగస్టు 1వ తేదీన గ్రాండ్ థియేట్రికల్‌కు సిద్ధం అవుతోంది.

Next Story