- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
STR51: రొమాంటిక్ హీరోతో మృణాల్ సినిమా.. అన్నీ ఆ సీన్లే ఉండబోతున్నాయా?
బాలీవుడ్, తెలుగులో దూసుకు వెళ్తున్న మృణాల్ ఠాకూర్ త్వరలోనే తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారట.

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్, తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది. దానికి తగ్గట్టుగానే ఆమె చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. త్వరలో అడవి శేషు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ్ లోకి మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ?
బాలీవుడ్, తెలుగులో దూసుకు వెళ్తున్న మృణాల్ ఠాకూర్ త్వరలోనే తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారట. ఇందులో భాగంగానే తమిళ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న తన 51వ సినిమాలో మృణాల్ ఠాకూర్ కు అవకాశం వచ్చిందట. STR 51 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ను సెలెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీకి కిల్లర్ అనే టైటిల్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. డెసింగ్ పెరియా సామి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ మూవీ రానుంది. కాగా ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు విపరీతంగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు క్రిటిక్స్.






