Mrunal Thakur: బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు మరో ఇండస్ట్రీసై కన్నేసిన మృణాల్ ఠాకూర్.. ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |   (  Updated:2025-05-02 15:26:27  IST  )

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ‘సీతా రామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది.

Mrunal Thakur: బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు మరో ఇండస్ట్రీసై కన్నేసిన మృణాల్ ఠాకూర్.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ‘సీతా రామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’ మూవీతో ఇండస్ట్రీలో తన క్రేజ్ మరింత పెంచుకుంది. తర్వాత ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘కల్కి’ వంటి చిత్రాలతో అలరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగులో ‘డెకాయిట్’ చిత్రంతో పాటు.. హిందీలో నాలుగు మూవీస్ చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కోలీవుడ్‌(Kollywood)లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

కోలీవుడ్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సూర్య (Surya) తాజాగా ‘రెట్రో’ (Retro) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్నాడు. ఇక మూవీ అనంతరం ఈ హీరో వెంకీ అట్లూరితో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి నెలకొనగా.. దీనికి సంబంధించిన షూటింగ్ మే నుండి ప్రారంభమవుతుందని కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్య సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. వీరిద్దరి కాంబోలో మూవీ అంటే పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story