- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AA22 : అల్లు అర్జున్ సినిమాలో తెరపైకి మరో హీరోయిన్..?
అల్లు అర్జున్ సినిమాలో దీపిక ఇప్పటికే ఫైనల్ అయ్యారట. మృణాల్ ఠాకూర్ తాజాగా హీరోయిన్ గా ఫిక్స్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు అట్లీతో జత కట్టారు. వీరిద్దరికి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లతో తీస్తున్నారట. ప్రస్తుతం ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. సోషియో మైథాలజీ ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని చెబుతున్నారు.
అయితే ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారని ప్రచారం జోరు అందుతుంది. దీపిక పదుకునే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ అలాగే రష్మిక మందాన హీరోయిన్లు అని టాక్ నడిచింది. అయితే, ఇందులో దీపిక ఇప్పటికే ఫైనల్ అయ్యారట. మృణాల్ ఠాకూర్ తాజాగా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోందట. ఇందులో భాగంగానే, ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో మృణాల్ పాల్గొంటున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో దీపికతో పాటు మృణాల్ మాత్రమే ఉంటారని చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






