అదిరిపోయే లుక్‌లో మృణాల్ ఠాకూర్.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించడంతో వైరల్ అవుతున్న పోస్ట్

by I. Sairam |

యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

అదిరిపోయే లుక్‌లో మృణాల్ ఠాకూర్.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించడంతో వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘సీతారామం’(Seetharamam) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’(Hi Nanna) మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఇక చివరిగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun)- అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో లక్కీ చాన్స్ కొట్టేసింది. అలాగే బాలీవుడ్‌లో ‘సన్ ఆఫ్ సర్దార్-2’(Son Of Sardar-2) మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇందులో స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్(Ajay Devgan) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. విజయ్ కుమార్ అరోరా(Vijay Kumar Arora) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 1న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది హీరోయిన్ మృణాల్. ఇందులో భాగంగా తాజాగా తన ఇన్‌స్టా(Instagram)లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో అదిరిపోయే అవుట్ ఫిట్‌లో కిర్రాక్ అనిపించింది. ఇక ఈ పిక్స్‌కు ‘రాబియా ఒక్కటే కానీ ఆమెకు ఉన్న మూడ్‌లు చాలా’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. వాహ్ ఏమన్నా ఉన్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story