- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన మృణాల్ ఠాకూర్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
‘సీతారామం’(Seetharamam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘సీతారామం’(Seetharamam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) మనందరికీ సుపరిచితమే. ఫస్ట్ మూవీలోనే చీరకట్టులో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మెప్పించింది. అయితే ఏమైందో ఏమో కానీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మ మళ్లీ మూవీస్ ఎప్పుడెప్పుడు చేస్తుందా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎట్టకేలకు మృణాల్ గుడ్ న్యూస్ చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పోస్ట్ చేసింది. అయితే ఈ చిన్నది ప్రజెంట్ అజయ్ దేవ్‌గణ్(Ajay Devgan) నటిస్తున్న ‘సన్ ఆఫ్ సర్దార్-2’(Son Of Sardar-2) మూవీలో నటిస్తోంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘దృశ్యం 49.. షాట్ 5.. టేక్ 1.. యాక్షన్’ అని రాసుకొచ్చింది. అలాగే చేతిలో షాట్ కొట్టే పరికరాన్ని పట్టుకుని క్యూట్‌గా స్మైల్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు, ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






