ఆ లేడీనే నా గర్ల్ ఫ్రెండ్.. మృణాల్ బోల్డ్ కామెంట్స్‌

by velandi.Saikiran |

త‌మ‌న్నా నా గర్ల్ ఫ్రెండ్ అంటూ మృణాల్ ఠాకూర్ బోల్డ్ కామెంట్స్ చేశారు.

ఆ లేడీనే నా గర్ల్ ఫ్రెండ్.. మృణాల్ బోల్డ్ కామెంట్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తమన్నా ఇస్ మై బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటూ టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) కామెంట్ చేశారు. తన చిన్నప్పటి నుంచి అబ్బాయిలతోనే కలిసి పెరగడం వల్ల అమ్మాయిలతో స్నేహం చేయలేకపోయానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తమన్నా తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిందంటూ మృణాల్ వెల్లడించారు. డెకాయిట్ సినిమా ప్రమోషన్స్ లో చాలా చురుగ్గా మృణాల్ ఠాకూర్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ... తమన్నా ప్యూర్ సోల్ అంటూ కితాబ్ ఇచ్చారు.

తమన్నా ప్యూర్ సోల్ - మృణాల్ ఠాకూర్

ఆమె అంటే తనకు చాలా ఇష్టమని.. ప్రతి విషయం తమన్నాతో పంచుకుంటానని వెల్లడించారు. జీవితాన్ని ఎంజాయ్ చేయమంటూ ఒక సిస్టర్ లాగా సలహాలు ఇస్తూ ఉంటుందని ప్రశంసల వర్షం కురిపించారు. కాగా తమన్నా, మృణాల్ ఠాకూర్‌ ఇద్దరు నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2లో మెరిసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేషు, మృణాల్ ఠాగూర్ హీరో, హీరోయిన్లుగా చేస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు షనీల్ డియో దర్శకత్వం వహించగా నిర్మాతలుగా సుప్రియ యార్లగడ్డ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీత స్వరాలు అందించారు.

Next Story