Mrunal Thakur: కాళ్లకు మెట్టెలతో దర్శనమిచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. వైరల్‌గా పోస్ట్

by Chukka Sudharani |

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘సితారామం’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో తన క్రేజ్ పెంచేసుకుంది.

Mrunal Thakur: కాళ్లకు మెట్టెలతో దర్శనమిచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. వైరల్‌గా పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘సితారామం’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో తన క్రేజ్ పెంచేసుకుంది. ఇక తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘డెకాయిట్’(Dacoit). అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షానీల్ డియో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో అనురాగ్ కశ్యప్(Anurag Kashyap), ప్రకాష్ రాజ్, జైన్ మరియే ఖాన్, సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మృణాల్ ‘డెకాయిట్’ షూటింగ్‌లో పాల్గొందంటూ తెలుపుతూ ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘అందమైన మృణాల్ డెకాయిట్ షూటింగ్ కోసం హైదరాబాద్‌కు చేరుకుంది.. అడివి శేష్ అండ్ మృణాల్‌తో పాటు ప్రధాన తారాగణంతో కూడిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. డిసెంబర్ 25న డెకాయిట్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది’ అంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇందులో మృణాల్ కాళ్లు మాత్రమే కనిపిస్తుండగా.. మెట్టెలు ఉన్న కాళ్లు చూసి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తోంది. Link

Next Story