- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృత్యుంజయ్ ఓటీటీ విడుదల తేదీ లాక్
ఈ సినిమాను ఏప్రిల్ 3వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: తాజాగా హీరో శ్రీ విష్ణు నటించిన ‘మృత్యుంజయ్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. మంచి అంచనాల నడుమ ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, భారీ స్థాయి విజయాన్ని సాధించడంలో మాత్రం విఫలమైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఏప్రిల్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన ఈ సినిమా, ఓటీటీ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో రేబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించగా, హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. కాల భైరవ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.






