‘మోగ్లీ’ అడ్వెంచర్ షురూ

by Sujitha Rachapalli |

రోషన్ కనకాల రెండో చిత్రం ‘మోగ్లీ’పై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. ‘కలర్ ఫొటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాక్షి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఓ మూగ, చెవిటి అమ్మాయికి, అబ్బాయికి మధ్య ప్రేమ కథను సీతారాముల కథగా చూపించినట్లు తెలుస్తోంది.

‘మోగ్లీ’ అడ్వెంచర్ షురూ
X

దిశ, సినిమా : రోషన్ కనకాల రెండో చిత్రం ‘మోగ్లీ’పై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. ‘కలర్ ఫొటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాక్షి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఓ మూగ, చెవిటి అమ్మాయికి, అబ్బాయికి మధ్య ప్రేమ కథను సీతారాముల కథగా చూపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేయడంలో సక్సెస్ కాగా ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్‌, రానాను కూడా ఇందులో భాగం చేశారు. ఈ క్రమంలోనే నాని ఈ చిత్రం కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు మాస్ యాక్షన్ డ్రామాగా వర్ణించాడు. రోషన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. మరోవైపు రానా కూడా రోషన్‌ను చూస్తుంటే చిరుతలో రామ్ చరణ‌్‌ను చూసినట్లుగా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. తమ కథను నమ్మి ‘అఖండ 2’తోపాటు వస్తున్న మేకర్స్.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతామని.. ‘అఖండ 2’ బిర్యానీ అయితే మా సినిమా ‘మీనాక్షి స్వీట్ పాన్’ లాంటిదని చెప్పారు. సినిమా చూసి తమను ఆశీర్వదించేందుకు థియేటర్స్‌కు రావాలని కోరారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story