- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోగ్లీ 2025.. సింగిల్ స్క్రీన్ టికెట్ ధరెంతో తెలుసా?
రోషన్ కనకాల హీరోగా, సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మోగ్లీ 2025.

దిశ, వెబ్‌డెస్క్: రోషన్ కనకాల హీరోగా, సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మోగ్లీ 2025. హర్ష చెముడు, బండి సరోజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా.. అఖండ-2 రిలీజ్ కారణంగా డిసెంబర్ 13కి వాయిదా పడింది. ఈ మేరకు మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఒక హైప్ ని క్రియేట్ చేశాయి.
కాగా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ ప్రమోషనల్ స్టంట్ చేశారు. సింగిల్ స్క్రీన్స్ టికెట్ల ధరను కేవలం రూ.99గా నిర్ణయించారు. ఇతర సినిమాల ధరలు ఎక్కువగా ఉండనున్న క్రమంలో.. మోగ్లీ సినిమా టికెట్ల ధరను తగ్గించడంతో ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. ఫలితంగా మోగ్లీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.






